HomeTelugu Trending'సలార్‌' ఫస్ట్‌ సింగిల్‌ విడుదల

‘సలార్‌’ ఫస్ట్‌ సింగిల్‌ విడుదల

Sooreede song from Salaar

స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా మూవీ సలార్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతుంది.

ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరరావు, జగపతిబాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తుండగా ఈ మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

తాజాగా సూరీడే అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ విడుదలైంది. హరిణి వైటూరి పాడిన ఈ సాంగ్ ని కృష్ణ కాంత్ రచించారు. ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ లిరిక్స్ తో సాగిన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.

సూరీడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, చిమ్మ చీకటిలోను నీడలా ఉండేటోడు, రెప్ప నొదలక కాపు కాసెడి కన్ను వాడు అంటూ సాగే లిరిక్స్ అందరినీ అలరిస్తాయి. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా కి రవి బస్రూర్ సంగీతం అందించగా భువన గౌడ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu