శ్రీమంతుడు కంటే మంచి సినిమా అంటున్నారు!

koratala

కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో దర్శక, నిర్మాతలు మీడియా ముఖంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా దర్శకుడు కొరటాలశివ మాట్లాడుతూ.. ”ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. నిజాయితీగా సినిమా గురించి మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, నిర్మాతలు కూడా బెస్ట్ ఫిల్మ్ అని చెబుతున్నారు. నేను ఊహించని ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయినందుకు చాలా సంతోశంగా ఉంది. శ్రీమంతుడు కంటే బెటర్ గా ఉందని అంటున్నారు. ఈ హ్యాట్రిక్ హిట్
తో నాపై బాధ్యత మరింత పెరిగింది. ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేయడానికి కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాను. నా తదుపరి సినిమా మహేశ్ బాబు హీరోగా ఉంటుంది” అని చెప్పారు.
నిర్మాత నవీన్ మాట్లాడుతూ.. ”అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. లేడీస్, యూత్ ఇలా ప్రతి ఒక్కరికీ సినిమా కనెక్ట్ అవుతుంది. మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీ” అని చెప్పారు.

CLICK HERE!! For the aha Latest Updates