Bigg Boss 8 Telugu First Finalist:
బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే కి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండగా, హౌస్‌లో ఘటనలు ఉత్కంఠ భరితంగా మారాయి. ఈ సీజన్‌లో టాప్ కంటెస్టెంట్‌గా నిలిచిన విష్ణు ప్రియ ప్రయాణం చాలా వింతగా జరుగుతుంది అని చెప్పొచ్చు.
రోజు లేచిన దగ్గరనుంచి విష్ణు ప్రియ పృథ్వి పై తన ప్రేమను వ్యక్తపరచడం అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రేమ కోణం షోకు కొత్త ఎంటర్టైన్మెంట్ ను తీసుకువచ్చింది. అయితే, ఇది గేమ్ పై ప్రభావం చూపుతోందని పలువురు ఆమెను హెచ్చరించారు. కానీ విష్ణు ప్రియ మాత్రం ఎవరి మాటలు పట్టించుకోకుండా పృథ్వి మీద మోజులో మునిగిపోయింది.
ఇటీవల షోలోకి ఎంటర్ అయిన శ్రీముఖి విష్ణు ప్రియతో వ్యక్తిగతంగా మాట్లాడి, “మీ ఫీలింగ్స్‌ను ఇగ్నోర్ చేసే మనిషి వెనుక ఎందుకు పడుతున్నారు?” అని ప్రశ్నించింది. ఇంకా, “ఇంక కేవలం రెండు వారాలే మిగిలి ఉన్నాయి. మీ గేమ్ పై దృష్టి పెట్టండి. ప్రేమలను పక్కన పెట్టండి” అని సూచించింది.
శ్రీముఖి మాటలు విష్ణు ప్రియను ప్రభావితం చేయగా, ఆమె పృథ్వి ని కలిసి, ఇకనుంచి తన గేమ్‌పై పూర్తిగా దృష్టి పెట్టబోతున్నానని చెప్పింది. ఈ నిర్ణయం విష్ణు ప్రియ ప్రయాణంపై ఎలా ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.
ALSO READ: Bigg Boss 8 Telugu ఫస్ట్ ఫైనలిస్ట్ ఫిక్స్.. టికెట్ టు ఫినాలే గెలుచుకుంది ఎవరంటే!