ఓటు వేసి ఆమెను గెలిపిస్తే.. ఒక్కొక్క వీధికి బావలుసయ్యా తప్పనిసరి.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగిసింది. మాకు ఓటెయ్యండంటే మాకు ఓటెయ్యండి అని ప్రజలను అభ్యర్థించారు. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఎడాపెడా హామీలు ఇచ్చేశారు. మొత్తానికి ఏపీలో ఎన్నికల సెగను పుట్టించారు. ఈరోజుతో ఆ సెగ కాస్త తగ్గిందనుకుంటే ఇప్పుడు శ్రీరెడ్డి రంగంలోకి దిగింది. నేరుగా కాకపోయినా సోషల్ మీడియా ద్వారా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ ఎన్నికల సెగను మరింత పెంచుతోంది. కాకపోతే ఆ సెగ శ్రీరెడ్డి స్టైల్లో ఉంది.

నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీని.. పవన్ కళ్యాణ్, నాగబాబును లక్ష్యంగా చేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడిన శ్రీరెడ్డి, ఇప్పుడు రూటు మార్చింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీలో ఉన్న సినీ నటి మాధవీలతను లక్ష్యంగా చేసుకుంది. ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టింది.

‘రండి బాబూ రండి డబ్బులున్న బావలందరికీ మాత్రమే సేవ. లేని వాళ్లు వేస్ట్. లంచాలు ఇస్తే లం..లో పని. రీసెంట్‌గా అమెరికాలో వ్యభిచారంలో ఇరుక్కుపోయిన ఒక నటి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది. అమెరికా ఎంబసీ పిలిచి వీసా రద్దుచేసి వార్నింగ్ ఇచ్చి గు.. మీద తన్ని పంపించింది. ఎవరామె?? ఓటు వేసి గెలిపిస్తే గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో ఒక్కొక్క వీధికి బావలుసయ్యా తప్పనిసరిగా పెడతాం. ఇదీ ఆమె హామీ. మా ఖర్మ చెత్త ము.. ఆమెకు ఓటు వేయకండి’ అంటూ పరోక్షంగా మాధవీలతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.

శ్రీరెడ్డి, మాధవీలత మధ్య గతంలోనూ మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే వాటిపై మాధవీలత అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీరెడ్డిలను నిరసిస్తూ పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలుపుతూ ఫిల్మ్ చాంబర్ ఎదుట మౌన దీక్ష చేపట్టారు. అంతేకాకుండా, ఫిల్మ్ చాంబర్ ఎదుట శ్రీరెడ్డి బట్టలు విప్పి కూర్చోడాన్ని కూడా మాధవీలత వ్యతిరేకించారు. అందుకే ఇప్పుడు మాధవీలతను శ్రీరెడ్డి టార్గెట్ చేస్తోంది. దీనిపై మాధవీలత స్పందిస్తారో లేదో చూడాలి.

CLICK HERE!! For the aha Latest Updates