మెగాస్టార్‌కే వార్నింగ్‌ ఇచ్చిన శ్రీరెడ్డి

చిరంజీవి ఎవర్ని అయితే టార్గెట్ చేయకూడదో ఆమెనే టార్గెట్ చేసాడు. ఈ మధ్యే బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్‌కు వచ్చిన మెగాస్టార్.. అక్కడ తమన్నా సింహాద్రిని ఓ రేంజ్‌లో పొగిడేసాడు. అంతేకాకుండా ఇన్ డైరెక్టుగా శ్రీ రెడ్డిపై సెటైర్లు కూడా వేసాడు. నువ్వు చాలా ధైర్యం గల అమ్మాయివమ్మా.. నీ ఫ్రెండ్ తప్పు చేసినా కూడా వేలెత్తి చూపించావు.. నేను నిన్ను అభినందిస్తున్నాను అంటూ తమన్నాపై పొగడ్తల వర్షం కురిపించాడు చిరు. అసలు విషయం ఏంటంటే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా శ్రీ రెడ్డి చేస్తున్న ఉద్యమానికి ముందు తమన్నా సపోర్ట్ చేసింది. కానీ ఆ తర్వాత ఆమె తప్పుదోవలో వెళ్తుందంటూ బయటికి వచ్చి విమర్శించింది కూడా.

అంతేకాకుండా పవన్ కల్యాణ్ సహా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినపుడు కూడా తమన్నా వ్యతిరేకించింది. అందుకే చిరు ఆమెను ప్రశంసించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మాటలు ఆ నోటా ఈ నోటా పడి శ్రీ రెడ్డి వరకు వెళ్లాయి. దాంతో ఈమె మళ్లీ తన నోటికి పని చెప్పేసింది. తాను చిరంజీవి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని.. అయితే తన నోటితోనే మాట్లాడించాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారంటూ మొదలుపెట్టింది. మెగా బ్రదర్స్ ఇద్దరూ మంచోళ్లంటూ పవన్, చిరంజీవి గొప్పలు చెప్పుకోవడం మానేయాలంటుంది ఈమె.

మీరు పదేళ్ల కింద పెట్టి మూసేసిన ప్రజారాజ్యంలో ఎంత సంపాదించి.. ఎంత పోగొట్టారో తనకు అంతా తెలుసు అంటూ పురాణం విప్పేసింది శ్రీ రెడ్డి. అక్కడితో ఆగకుండా మెగా కుటుంబంపై కూడా చాలా విమర్శలు చేసింది శ్రీ రెడ్డి. వాళ్లే హీరోలా.. మిగిలిన వాళ్లు అసలుండాలా లేదా అంటూ ప్రశ్నించింది. అంతేకాదు.. మీరే 13 మంది హీరోలకు జన్మనిచ్చారు కదా.. ఇండస్ట్రీపై వదిలేసారు కదా అంటూ రెచ్చిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, అవమానాల గురించి మేం ఉద్యమం చేస్తుంటే.. అది మీ కళ్లకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించింది ఈమె.

మీ తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను అన్నానని మనసులో పెట్టుకుని నా గురించి ఇలా మాట్లాడతావా అంటూ ప్రశ్నించింది శ్రీ రెడ్డి. తను చేసిన ఈ వీడియో చూసిన తర్వాత కచ్చితంగా మళ్లీ అంతా తనను మూకుమ్మడిగా తిడతారని.. దొరికితే కొడతారని.. వీలైతే చంపేస్తారని కూడా చెప్పింది ఈమె. స్టేజీపై చిరంజీవి అలా మాట్లాడుతుంటే.. మరోవైపు నాగార్జున చప్పట్లు కొడుతున్నాడంటే ఇండస్ట్రీ ఎలాంటి వాళ్ల చేతుల్లో ఉందో అర్థం చేసుకోవాలంటుంది శ్రీ రెడ్డి. మొత్తానికి ఏదేమైనా కూడా చిరంజీవినే టార్గెట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది శ్రీ రెడ్డి. మరి ఈ వివాదం ఎంతదూరం వెళ్తుందో.