శ్రీదేవి సీక్వెల్ ప్లాన్ చేస్తోంది!

దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం బాలీవుడ్ లో వచ్చిన ‘మిస్టర్ ఇండియా’ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అప్పట్లో బాలీవుడ్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన సినిమా అది. శ్రీదేవి, అనీల్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రూపొందించే ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు ఈ చిత్రాన్ని బోణీకపూర్ నిర్మించారు. ఆ సమయంలోనే శ్రీదేవితో బోణీకపూర్ వివాహం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ‘మామ్’ సినిమాలో నటిస్తోన్న శ్రీదేవి త్వరలోనే ఈ ‘మిస్టర్ ఇండియా’ సీక్వెల్ లో నటించబోతోందని సమాచారం. 
ఈ సినిమాలో శ్రీదేవి, అనీల్ ల పాత్రలు అప్పటిమాదిరినే ఉంటాయని తెలుస్తోంది. అనీల్ కుమారుడు తనయుడు హర్షవర్ధన్ కపూర్ కూడా  ఈ సినిమాలో నటించబోతున్నాడు. మిస్టర్ ఇండియా చిత్ర దర్శకుడు శేఖర్ కపూర్ ఇప్పుడు సీక్వెల్ డైరెక్ట్ చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో మరో డైరెక్టర్ ను వెతికే పనిలో పడ్డారు. ఓం ప్రకాష్ మెహ్రా, లేదంటే రవి ఉడియార్ ల చేతికి ఈ ప్రాజెక్ట్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా చర్చల దశల్లోనే ఉంది. ఈ సినిమాను కూడా బోణీకపూర్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సివుంది!