చైతు అత్తగా శ్రీదేవి..?

నాగచైతన్య-మారుతి కాంబినేషన్ లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. పెళ్లి తరువాత వచ్చే ఈగోల కారణంగా ఈ సినిమా సాగనుంది. అయితే అత్త పాత్రలో రమ్యకృష్ణను తీసుకోవాలని భావించారు చిత్రబృందం. అయితే ఇప్పటికే రమ్యకృష్ణ చాలా సినిమాలలో అత్త పాత్రలు పోషించింది. దీంతో సినిమాకు ఫ్రెష్ ఫీలింగ్ రావాలంటే మరో నటిని తీసుకోవాలని దర్శకనిర్మాతలకు సజెషన్స్ ఇస్తున్నారట.
దీంతో అందాల తార శ్రీదేవిని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. పైగా శ్రీదేవి-చైతు అంటే ఆ కిక్కే వేరు. శ్రీదేవి నటిస్తే సినిమాకు బాలీవుడ్ టచ్ రావడంతో పాటు తమిళంలో కూడా క్రేజ్ వస్తుంది. ఆ కారణంగా దర్శకుడు మారుతి కూడా శ్రీదేవిపై దృష్టి పెడుతున్నారట. మరి శ్రీదేవి దీనికి అంగీకరిస్తుందో లేదో.. చూడాలి!