ఎన్టీఆర్ ఏం చేస్తాడో..?

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ ఇలా వరుస హిట్స్ తో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్
చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ వంటి హిట్ సినిమా తరువాత చేయబోయే సినిమా
కూడా అదే రేంజ్ లో ఉండాలని వినాయక్, బోయపాటి , త్రివిక్రమ్ వంటి దర్శకులతో సినిమా
చేయాలనుకున్నాడు. కానీ వారు తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వలన ఎన్టీఆర్ కు సమయాన్ని
కేటాయించలేకపోయారు. ఈ నేపధ్యంలో తనకు టెంపర్ వంటి హిట్ సినిమా ఇచ్చిన పూరీ
జగన్నాథ్ తోనే సినిమా చేయాలనుకున్నాడు. పూరీ కథను సిద్ధం చేసుకొని ఎన్టీఆర్ కు
వినిపించాడు కూడా.. అయితే ఇజం సినిమా రిజల్ట్ బట్టి ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా
ఛాన్స్ ఉందనే వార్తలు వినిపించాయి. ఇజం పెద్ద హిట్ అయితే ఖచ్చితంగా ఎన్టీఆర్, పూరీతో
సినిమా చేద్దామని అనుకున్నట్లు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఇజం సినిమాకు మిశ్రమ
స్పందన లభిస్తోంది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా పూరీతో ఉంటుందా..? లేక మరో డైరెక్టర్
తో చేస్తాడా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates