HomeTelugu Trendingపాన్ ఇండియా మూవీలో శ్రీకాంత్ తనయుడు రోషన్

పాన్ ఇండియా మూవీలో శ్రీకాంత్ తనయుడు రోషన్

Roshan latest movie
మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో ‘వృషభ’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నంద కిశోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, ఈ మూవీ నుంచి ఇప్పుడు ఓ కీలక అప్‍డేట్ వచ్చింది. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ మేక ఈ వృషభ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.

శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన చిత్రాల్లో ఇప్పటి వరకు సరైన హిట్ దక్కలేదు. ఇప్పుడు రోషన్ ఓ పాన్ ఇండియా మూవీలో కీలక పాత్ర దక్కించుకున్నాడు. వృషభ చిత్రంలో మోహన్‌లాల్ కుమారుడిగా కనిపించనున్నాడు.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రోషన్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. లుక్స్ పరంగా ఇప్పటికే సౌతిండియా హృతిక్ రోషన్ అంటూ రోషన్‍ను చాలా మంది అంటున్నారు.

రుద్రమదేవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన రోషన్.. 2016లో నిర్మలా కాన్వెంట్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2021లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి డైరెక్షలో పెళ్లి సందడి చిత్రంలో హీరోగా చేశాడు. పెళ్లి సందడి చిత్రం ఊహించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా రోషన్‍కు మంచి మార్కులు పడ్డాయి. అతడి లుక్, నటనకు ప్రశంసలు దక్కాయి.

ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్ మూవీ, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిత్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ వృషభ సినిమా హిట్ అయితే మాత్రం అతడు పాన్ ఇండియా రేంజ్ హీరో అయ్యే అవకాశం ఉంది.

మలయాళం, తెలుగులో ద్విభాష చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. వృషభ చిత్రాన్ని అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నానీ, జురీ పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మాథుర్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!