HomeTelugu Big Storiesఆర్జీవీని మెచ్చుకున్న ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్

ఆర్జీవీని మెచ్చుకున్న ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్

 

RGV wtih Vijayendra Prasad
సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజా చిత్రం లడ్కీ. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి తెలుగులో అమ్మాయి, తమిళంలో పొన్ను అని పేర్లను ఖరారు చేశారు. పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్న ఈ సినిమాలో పూజా భలేకర్ హీరోయిన్.

తాజాగా అమ్మాయి సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, కీరవాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి శ్యామల హోస్ట్‌గా వ్యవహరించింది. ఈ సినిమా జులై 15న విడుదల కానుంది. ఈ సినిమా కోసం హీరోయిన్ భలేకర్ పదేళ్లుగా కష్టపడిందట.

Shyamala with RGV

మార్షల్‌ ఆర్ట్స్‌ బేస్డ్ మూవీ కాబట్టి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఓ గేమ్‌ ఆడదామని ఆర్జీవీని అడిగింది యాంకర్ శ్యామల. ఇప్పటివరకూ ఇతర భాషల్లో వచ్చిన మార్షల్‌ ఆర్ట్స్‌ సినిమాలను తెలుగులో చెప్తాను, ఆ సినిమా టైటిల్‌ ఏమిటో గెస్‌ చేయాలంది. చంపూ రశీదు సినిమా ఒరిజినల్‌ టైటిల్‌ ఏమిటో చెప్పాలని శ్యామల మొదటి ప్రశ్న అడిగింది.

దీనికి వర్మ ఆ పేరెప్పుడూ వినలేదే అని తల గోక్కున్నాడు. దీంతో శ్యామల కిల్‌ బిల్‌ అని సమాధానం చెప్పి నవ్వేసింది. ఇది జోకా? అని ఓ చూపు చూసిన వర్మ.. ప్రస్తుతం నేను ఎమోషనల్‌గా ఉన్నాను. ఇది సీరియస్‌ సినిమా. ఇలాంటి జోకులు వద్దు అంటూ స్టేజీపై నుంచి విసురుగా వెళ్లిపోయాడు. దీంతో శ్యామల.. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అంటూ క్షమాపణలు చెప్పింది.

RGV Ammayi

అయితీ ఈ కార్యక్రమానికి హాజరైన విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఆర్జీవీని మెచ్చుకున్నారు. ఈ చిత్రం చూశాక ఆర్జీవీలో మళ్లీ శివ కాలం నాటి డైరెక్టర్‌ను చూశాను అన్నారు. శివ కంటే వందింతలు ఎక్కువగా కనిపించారు అన్నారు విజయేంద్ర ప్రసాద్. అమ్మాయి సినిమా 40 వేల థియేటర్లలో విడుదల అవుతుందంటే తెలుగువారందరికీ గర్వకారణం అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu