రాజమౌళికి నాకు బేదాభిప్రాయాలు ఉన్నాయి.. జక్కన్న తండ్రి ఆస్తకికర వ్యాఖ్యలు

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తన కుమారుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఇంత గొప్ప దర్శకుడు అవుతాడని ఊహించలేదని అన్నారు. ‘బాహుబలి’, ‘మణికర్ణిక’ వంటి బ్లాక్‌బస్టర్స్‌కు కథ అందించిన ఆయన తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. తన కుమారుడు జక్కన్న పట్ల గర్వంగా ఫీలయ్యారు. ‘ఇప్పటి మోడ్రన్‌ తండ్రీ కుమారుడిలా నేను, రాజమౌళి ఉండం. ఇంట్లో నేను పాతతరం తండ్రిలాగే గౌరవం ఇవ్వాలంటూ కమాండ్‌ చేస్తుంటా. కానీ సెట్‌కి వెలితే మాత్రం అతడే బాస్‌. అతడు దర్శకుడు, నేను అతడి రచయితను. నిజానికి రాజమౌళి ఇలా ఓ స్టార్‌ దర్శకుడు అవుతాడని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ అతడిలో ఇంప్రెసీవ్‌ నరేటర్‌ ఉన్నాడు. అలా నాకు సహాయం చేస్తూ.. దర్శకుడయ్యాడు’.

ఇద్దరి మధ్య సినిమాల విషయంలో భిన్నాభిప్రాయాల గురించి ప్రశ్నించగా.. ‘అవి ఎప్పుడూ ఉండేవే. నేను ఒప్పుకోని విషయాలు కూడా ఉన్నాయి. కానీ చివరికి రాజమౌళి అనుకున్నదే ఫైనల్‌ అయ్యేది. ఎందుకంటే అతడే దర్శకుడు, కెప్టన్‌ ఆఫ్‌ ది షిప్‌’ అని విజయేంద్ర ప్రసాద్‌ అన్నారట.