HomeTelugu Big Storiesబాలయ్యబాబు ఒక ఆటంబాంబు: రాజామౌళి

బాలయ్యబాబు ఒక ఆటంబాంబు: రాజామౌళి

SS Rajamouli speech in akha

నందమూరీ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అఖండ’. డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమా డిసెంబర్‌ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ శిల్పకళావేదిక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిధులుగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్. రాజామౌళి, టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హాజరైయ్యారు. బాలయ్య పాటలతో, డైలాగ్స్‌తో స్టేజ్‌ దద్దరిలిపోతుంది.

ప్రీరిలీజ్‌ వేడుకకు విచ్చేసిన ఆయన డ్యూయెట్‌ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ..‘బోయపాటి శ్రీనుగారు ఈ ఆడిటోరియానికే కాదు, సినిమా ఇండస్ట్రీకి ఒక ఊపు తెచ్చినందుకు ధన్యవాదాలు. డిసెంబరు 2 నుంచి మొదలు పెట్టి వరుసగా థియేటర్‌లన్నీ ప్రేక్షకుల సందడితో నిండిపోవాలి. బాలయ్యబాబు ఒక ఆటంబాంబు. దాన్ని ఎలా కరెక్ట్‌గా ప్రయోగించాలో శ్రీనుగారికి తెలుసు. మీరు ఆ సీక్రెట్‌ అందరికీ చెప్పాలి. దాచేసుకుంటే కుదరదు. బాలయ్యబాబు కూడా ఆయన ఎనర్జీ సీక్రెట్‌ ఏంటో చెప్పాలి. మీ అందరిలాగే నేను కూడా ‘అఖండ’ను థియేటర్‌లో చూడాలని అనుకుంటున్నా’’ అని రాజమౌళి అన్నారు.

తాను మొదటిసారి డ్రమ్స్‌ వాయించింది బాలకృష్ణ నటించిన ‘భైరవద్వీపం’ చిత్రానికేనని, ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని సంగీత దర్శకుడు తమన్‌ అన్నారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు తమని తాము మైమరిపోతారని బాలకృష్ణ నటన హైలైట్‌గా ఉంటుందని చెప్పారు.

నందమూరి బాలకృష్ణ సినిమాకు పాడే అవకాశం వచ్చినందుకు గాయకుడు ఎస్పీ చరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రిలో ఉండగా, కోలుకోవాలని బాలకృష్ణ పూజలు, అర్చనలు చేయించారని, ఆ మేలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. అందుకు ఇప్పుడు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!