
PVR INOX ScreenIT feature:
PVR INOX యాప్‌లో సరికొత్త ఫీచర్ స్క్రీన్‌ఐటీను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో ప్రేక్షకులు తమకు కావలసిన సినిమాను సెలెక్ట్ చేసుకొని థియేటర్‌లో షో ప్లాన్ చేయవచ్చు. లేకపోతే, ఇప్పటికే ప్లాన్ అయిన షోకు జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
సాధారణంగా, పాత సినిమాలను తిరిగి థియేటర్‌లో చూడాలంటే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ స్క్రీన్‌ఐటీ వల్ల ఈ సమస్య లేదు. ఇప్పుడు ప్రేక్షకులే తమకు ఇష్టమైన పాత సినిమాలను థియేటర్‌లో మళ్లీ చూడవచ్చు.
‘తుంబాడ్’, షారుఖ్ ఖాన్ క్లాసిక్స్ కల్ హో నా హో, వీర్ జారా వంటి సినిమాలు తిరిగి విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుండి గొప్ప ఆదరణ పొందాయి. ఈ విజయాల క్రమంలో పీవీఆర్ ఇనాక్స్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది.
గత సంవత్సరం థియేటర్ వ్యాపారం 6 శాతం పడిపోయింది. 2023లో 94.3 కోట్ల ఫుట్‌ఫాల్స్ ఉంటే, 2024లో ఇది 88.3 కోట్లకు పడిపోయింది. పాండమిక్ తర్వాత ఇలాంటి డ్రాప్ అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి స్క్రీన్‌ఐటీను ప్రయోగిస్తున్నారు.
స్క్రీన్‌ఐటీ ప్రయోజనాలు:
1. ప్రేక్షకులు తమకు ఇష్టమైన సినిమాలను, టైమింగ్, ప్రదేశం ఎంచుకునే అవకాశం.
2. 500కి పైగా టైటిల్స్ లైబ్రరీతో ప్రారంభించి, త్వరలోనే 1000కు పెంచే యోచనలో ఉన్నారు.
3. టియర్-1 నగరాల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
ఈ నేపథ్యంలో వస్తున్న కొన్ని చర్చలు:
*ఈ ఫీచర్ కొత్తగా అనిపించినా, కొన్ని సమస్యలను హైలైట్ చేస్తోంది.
*కొత్త కంటెంట్‌పై పెట్టుబడులు తగ్గడం, పాత సినిమాలపై ఆధారపడడం.
*టియర్-1 నగరాలకే పరిమితం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రేక్షకులు దూరమవుతున్నారు.
“తగ్గిపోతున్న టికెట్ ధరలు, మెరుగైన స్టోరీటెల్లింగ్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.













