Game Changer Release Date:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. భారతీయుడు 2 ముందు వరకు సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి కానీ.. భారతీయుడు 2 తర్వాత అంచనాల కంటే అనుమానాలు ఎక్కువ అయ్యాయి. అయితే శంకర్ మీద నమ్మకం అంతంత మాత్రంగానే ఉన్నా, కథ అందించింది కార్తీక్ సుబ్బరాజ్ కాబట్టి మళ్ళీ హోప్స్ వచ్చాయి.
ఇప్పటికే సినిమాలో రామ్ చరణ్ పాత్ర షూటింగ్ పూర్తి అయింది. తాజా సమాచారం ప్రకారం.. చిత్ర బృందం ఎప్పుడు రామ్ చరణ్ కాకుండా మిగతా నటీనటుల మీద పూర్తి చేయాల్సిన.. సన్నివేశాలను షూట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శంకర్ ఈ సన్నివేశాల షూటింగ్ బాధ్యతను సినిమా సెకండ్ డైరెక్టర్ కి అప్పగించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ రెండవ డైరెక్టర్ మరెవరో కాదు శైలేష్ కొలను. హిట్ ఫ్రాంచైజ్ తో బాగా పాపులర్ అయిన శైలేష్.. ఇప్పుడు గేమ్ చేంజర్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను ఈ మధ్యనే సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవలేదు.
మరి గేమ్ చేంజర్ సినిమా తో శైలేష్ ఎంతవరకు మంచి పేరు తెచ్చుకుంటారో వేచి చూడాలి. బాలీవుడ్ బ్యూటీ కి అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ తో రొమాన్స్ చేసిన తీయరా మళ్లీ ఇన్ని రోజులకి చెర్రీ సరసన హీరోయిన్ గా కనిపించనుంది.
ఇవాళ కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా.. చిత్ర బృందం ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఒక అందమైన పోస్టర్ ను విడుదల చేసింది. సినిమాలో ఈమె జాబిలమ్మ అనే పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు అని టాక్ వినిపిస్తోంది.
పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ.. గేమ్ చేంజర్ విడుదల గురించి క్రిస్మస్ కి కలుద్దాం అని దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.