సుడిగాలి సుధీర్‌ ‘G.O.A.T’


‘జబర్దస్త్’ కమెడియన్‌ సుడిగాలి సుధీర్ తాజాగా తన నాల్గోవ సినిమా చేస్తున్నాడు. ఇండస్ట్రీలోని బడా నిర్మాతల సమక్షంలో సుడిగాలి సుధీర్ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్లపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈమెకు ఇదే తొలి తెలుగు సినిమా.

ఇటీవలే ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ‘GOAT – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ అనే ఆసక్తిక టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు చంద్రశేఖర్ రెడ్డి, బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఒక మంచి కాన్సెప్ట్‌తో తమ సినిమా తెరకెక్కుతోందని చెప్పారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోందని.. నేడు సుడిగాలి సుధీర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను ప్రకటించడం ఆనందంగా ఉందని అన్నారు. ‘GOAT’ టైటిల్ ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మంచి సంగీతం అందించారు అని. మంచి కథతో వస్తోనన తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి ప్రోత్సాహం లభిస్తుందని తాము ఆశిస్తున్నామని చెప్పారు.

చిత్ర దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ.. ‘ఒక మంచి కాన్సెప్ట్‌తో కూడిన కథను తెర మీదికి తీసుకురావడానికి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా షూటింగ్‌ కోసం మేం ఏది అడిగితే అది సమకూరుస్తున్నారు. హీరో, హీరోయిన్ మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. లియోన్ జేమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారరు. ఒక మంచి స్టోరీతో వస్తోన్న ఈ సినిమాను ఆదరించాలని ఆడియన్స్‌ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates