HomeTelugu Trendingరీమేక్‌ మూవీలో హీరోగా సునీల్‌

రీమేక్‌ మూవీలో హీరోగా సునీల్‌

Sunil as a hero in Kannada
టాలీవుడ్‌లో సునీల్‌ హాస్యనటుడి గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కొన్ని సినిమాలలో హీరోగా నటించాడు. అయితే, హీరోగా సక్సెస్ కాలేకపోవడంతో మళ్లీ ఇటీవలి కాలంలో కమెడియన్ గా.. విలన్ గా కూడా నటిస్తున్నాడు. అదే సమయంలో మళ్లీ హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటిస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు.

ఈ క్రమంలో ఈ హాస్యనటుడు ఓ కన్నడ సినిమా తెలుగు రీమేక్ లో హీరోగా నటించనున్నట్టు తెలుస్తోంది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ఇటీవల కన్నడలో రూపొందిన ‘బెల్ బాటమ్’ సినిమా ఓటీటీ ద్వారా విడుదలై, మంచి కామెడీ సినిమాగా టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ చిత్రకథ, అందులోని పాత్ర సునీల్ కు బాగా సూటవుతాయన్న ఉద్దేశంతో ఆయనను హీరోగా ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu