HomeTelugu Trendingబాలయ్యకు విలన్‌గా సునీల్‌?

బాలయ్యకు విలన్‌గా సునీల్‌?

7 11

టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్‌. ఆ తరువాత రాజమౌళి డైరెక్షన్‌లో ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా పలు చిత్రాలు చేసినప్పటికీ సునీల్‌కు పెద్దగా కలిసిరాలేదు. దానితో మళ్ళీ కమెడియన్‌గానే కొనసాగుతున్నాడు. ఇప్పటి వరుకు కమెడియన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన సునీల్ రవితేజ ‘డిస్కోరాజా’ సినిమాలో విలన్‌గా నటించాడు . ‘కలర్‌ ఫొటో’ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో విలన్‌గా సునీల్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య పవర్‌ ముందు సునీల్‌ నిలబడగలడా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత వరకు ఉందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!