‘బుల్లెట్‌ మీదొచ్చె బుల్‌ రెడ్డి’.. అంటూ చిందులేస్తున్న పాయల్‌ రాజ్‌పుత్

‘రెడ్డిగారి కుర్రాళ్లిట్ట.. రెచ్చిపోతే ఎట్టాగంట..’ అంటూ చిందులేస్తున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన ‘సీత’ సినిమాలో పాయల్‌ ఓ ప్రత్యేక గీతంలో నటించారు. ఈ పాట లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ‘బుల్లెట్‌ మీదొచ్చె బుల్‌ రెడ్డి.. యమహా ఏసుకొచ్చె యాదిరెడ్డి..’ అంటూ సాగుతున్న ఈ పాట మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంది. ‘సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అంటూ చిత్రబృందం ఈ పాట గురించి ప్రత్యేకంగా చెబుతోంది. పాయల్‌ నటించిన తొలి ప్రత్యేక పాట ఇది. ‘సీత’ సినిమాలో ఈ పాట చాలా ముఖ్యమని, కీలక పాయింట్‌గా ఉంటుందని గతంలో దర్శకుడు తేజ వెల్లడించారు. అనూప్‌ రూబెన్స్‌ సినిమాకు సంగీతం అందించారు. ఏప్రిల్‌ 25న ‘సీత’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.