HomeTelugu Trendingవెబ్‌ సిరీస్‌ చేయనున్న వెంకటేష్‌..?

వెబ్‌ సిరీస్‌ చేయనున్న వెంకటేష్‌..?

1 8

స్ట్రీమింగ్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. జనాలు ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలను వెబ్ సిరీసులను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వెబ్ సిరీస్ లు ఇప్పుడు సినిమాలనే మించిపోయాయి. అందుకే వీటిలో నటించేందుకు స్టార్ హీరోయిన్లు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు అదే బాటలో కొందరు స్టార్ హీరోలు కూడా పలు వెబ్ సిరీస్ లలో కనిపిస్తుండగా.. తాజాగా ఓ సీనియర్ హీరో కూడా వెబ్ సిరీస్ లో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో వెబ్ సిరీస్ తీయాలని ప్లాన్ చేస్తున్నారట. సురేష్ బాబు ఇప్పటికే ఆ విధంగా ఆలోచనలు మొదలు పెట్టేశాడట. తెలుగు వెబ్ సిరీస్ సంచలనం అయ్యేలా వెంకటేష్ తో ఒక సిరీస్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. దీనిపై డైరెక్టర్ తేజతో డిస్కషన్ కూడా జరిగిందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తాల్లో నిజమెంత ఉన్నదనేది తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu