HomeTelugu Trending'ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28' స్పెషల్‌ వీడియో

‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28’ స్పెషల్‌ వీడియో

Ssmb 28 makers unveil mahesమహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ‘సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్’ అంటూ ‘సర్కారు వారి పాట’ నుంచి విడుదలైన స్పెషల్‌ మీడియాకు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28’ మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను ఆవిష్కరించారు.

వీడియో విజువల్స్ ‘అతడు’ సినిమా నుండి వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది. మహేష్ మునుపటి చిత్రాల నుండి తీసిన యాక్షన్, ఎమోషనల్ క్లిప్పింగ్స్ అన్నీ ఒకే దగ్గర చేర్చి ఈ వీడియో తయారు చేశారు. వీడియోలో మహేష్ నిజ జీవితంలో మానవతావాదం కూడా హైలైట్ చేశారు. వికలాంగులతో ఆయన ఉన్న క్లిప్పింగ్‌లు, అవసరమైన పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేయడంలో సహాయపడటం కూడా వీడియోలో చూపించారు. చివరికి “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28″పై ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ప్రత్యేక ప్రకటన రానుందని ప్రకటించారు. ఈ వీడియోను మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

‘మహేష్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’ వచ్చేసింది

Recent Articles English

Gallery

Recent Articles Telugu