HomeTelugu Trendingమహేష్‌- తివిక్రమ్‌ మూవీ అప్డేట్‌.. హీరోయిన్‌ ఎవరో తెలుసా!

మహేష్‌- తివిక్రమ్‌ మూవీ అప్డేట్‌.. హీరోయిన్‌ ఎవరో తెలుసా!

Mahesh babu trivikram ssmb2

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా ఈరోజు ఆయనకు సెలబ్రెట్స్‌ నుంచి ఫ్యాన్స్‌ వరకు అందరూ.. శుభాకంక్షాలు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో కూడా సందడి నెలకొంది. ఆయనకు సంబంధించిన సినిమాల అప్డేట్‌ ఇస్తున్నారు. అభిమాలను వాటిని వైరల్‌ చేస్తున్నారు. హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను మూవీ యూనిట్‌ షేర్‌ చేసింది. హీరోయిన్‌తో పాటు, సాంకేతిక బృంద వివరాలను వెల్లడించింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఇక ఎ.ఎస్‌.ప్రకాశ్‌ ఆర్ట్‌ డైరక్టర్‌గా, నవీన్‌ నూలి ఎడిటర్‌గా, మది సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. తమన్‌ సంగీతం అందించనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం మహేశ్‌ ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. పరుశురామ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేశ్‌-త్రివిక్రమ్‌ కాంబో సెట్స్‌పైకి వెళ్లనుంది.

‘మహేష్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’ వచ్చేసింది

లవ్‌ యూ నాన్న..

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!