HomeTelugu Trendingసూర్య 'కాటుక కనులే మెరిసిపోయే' సాంగ్‌ ప్రొమో

సూర్య ‘కాటుక కనులే మెరిసిపోయే’ సాంగ్‌ ప్రొమో

katuka kanule song promo

హీరో సూర్య నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ పేరుతో రిలీజ్‌ చేయనున్నారు. అపర్ణా బాలమురళి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పిల్లా పులి సాంగ్‌ వీడియో ప్రోమో, టీజర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఈ క్రమంలో కాటుక కనులే అంటూ సాగే మరో రొమాంటిక్‌ సాంగ్‌ వీడియో ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం.‘‘కాటుక కనులే మెరిసిపోయే..’ అని సాగే ఈ పాట హీరోహీరోయిన్ల ప్రణయ బంధానికి అద్దం పడుతోంది. సూర్య, అపర్ణ తమ సహజ నటన, లుక్స్‌తో సూపర్‌ అంటు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu