HomeTelugu Newsఅన్నదమ్ముల కాంబినేషన్‌లో మల్టీస్టారర్.!

అన్నదమ్ముల కాంబినేషన్‌లో మల్టీస్టారర్.!

10 24తమిళ స్టార్‌ హీరోలు స్యూర, కార్తీ కలిసి మల్టీస్టారర్‌ మూవీ చేస్తున్నారట. మలయాళంలో ఇటీవలి కాలంలో మంచి హిట్ అనిపించుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ తమిళ రీమేక్ లో ఈ అన్నదమ్ములిద్దరూ కలసి నటించనున్నట్టు తాజా సమాచారం. ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులను సూర్య కొనుగోలు చేశాడట. తమ్ముడితో కలిసి ఇందులో నటించాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. అదే నిజమైతే ఇక ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పచ్చు.

కాగా ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేయడానికి మరోపక్క సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ, రానాలతో దీనిని ఆయన రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu