HomeTelugu Newsదసరా కానుకగా 'అదుగో' పందిపిల్ల

దసరా కానుకగా ‘అదుగో’ పందిపిల్ల

విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు రవిబాబు మరో సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే జంతువులు ప్రధాన పాత్రల్లో తెలుగు తెరపై చాలా సినిమాలు వచ్చాయి. అయితే తొలిసారిగా ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమాను రూపొందిస్తున్నారు రవిబాబు. ‘అదుగో’ పేరుతో సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

6 17

అయితే ఈ చిత్రాన్ని అన్ని భారత భాషల్లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అందరూ చిత్రానికి కనెక్ట్‌ అయ్యేలా రఘుబాబు దీన్ని తెరకెక్కిస్తున్నారని తెలిపారు. భారత చిత్ర పరిశ్రమ చ‌రిత్ర‌లోనే తొలిసారి పూర్తిస్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్‌ను చూపిస్తోన్న సినిమా ఇదని పేర్కొన్నారు. తెలుగులో ‘అదుగో’ టైటిల్‌‌తో రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాష‌ల్లో మాత్రం ‘బంటి’ పేరుతో విడుద‌ల కాబోతోందని అన్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాకు ఫైనల్‌గా రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అదుగో పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిషేక్, నాభ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu