HomeTelugu Trending'సీటిమార్'.. జ్వాలా రెడ్డి గా తమన్నా ఫస్ట్‌లుక్‌

‘సీటిమార్’.. జ్వాలా రెడ్డి గా తమన్నా ఫస్ట్‌లుక్‌

1 7
టాలీవుడ్ హీరో గోపీచంద్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘సీటిమార్’. కబడ్డీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం నంది దర్శకత్వంలో రూపొందుతుంది. ఇక ఇప్పటికే రిలీజ్‌ చేసిన గోపిచంద్‌ లుక్‌ ఆకట్టుకుంది. ఈ సినిమాలో గోపిచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్ గా.. మీల్కి బ్యూటీ తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్ గా నటిస్తున్నారు. తాజాగా తమన్నా పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మూవీయూనిట్‌. తమన్నా జ్వాలా రెడ్డి గా కనిపించనున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటి భూమిక, రావు రమేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu