HomeTelugu Trendingశృతి ఇప్పటికీ నన్ను చిన్నపిల్లలా చూస్తోంది: తమన్నా

శృతి ఇప్పటికీ నన్ను చిన్నపిల్లలా చూస్తోంది: తమన్నా

1 4మిల్కీ బ్యూటీ తమన్నా తన బెస్ట్‌ ఫ్రెండ్‌, హీరోయిన్‌ శృతిహాసన్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. సినీ పరిశ్రమలో నటీనటులందరి కంటే తనకు శ్రుతిహాసన్‌ అంటేనే చాలా ఇష్టమని తెలిపింది. ముంబైలో తమ ఇంటి సమీపంలోనే ఆమె నివాసం కూడా ఉండేదని చెప్పింది.

తాము తరచు కలిసే వారిమని, ఫోనులో కూడా ముచ్చట్లు చెప్పుకునే వారిమని చెప్పింది. సాధారణంగా తాము తమ జీవితాల గురించి మాట్లాడుకుంటామని, శ్రుతి హాసన్‌కు నెగిటివిటీ అంటే ఇష్టముండదని చెప్పింది. ఆమెలోని ఆ గుణమే తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్‌ అయ్యేలా చేసిందని తెలిపింది. శృతిహాసన్‌ ఇప్పటికీ తనను ఓ చిన్నపిల్లలానే చూస్తుందని చెప్పింది. కాగా సినీ పరిశ్రమలో ఇద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్‌లు ఇద్దరూ బీజీగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!