HomeTelugu Trendingమీడియా ప్రతినిధులపై తమన్నా బౌన్సర్‌ల దాడి

మీడియా ప్రతినిధులపై తమన్నా బౌన్సర్‌ల దాడి

Tamannaah Security Guards a
మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ‌బ్లీ బౌన్స‌ర్’ ప్ర‌మోష‌న్‌లో భాగంగా శ‌నివారం హైద‌రాబాద్ వ‌చ్చిన త‌మ‌న్నా… న‌గ‌రంలో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా విధి నిర్వహణలో వున్న మీడియా ప్ర‌తినిధుల‌పై త‌మ‌న్నాకు ర‌క్ష‌ణ‌గా వ‌చ్చిన బౌన్స‌ర్లు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్ద‌రు కెమెరామెన్ల‌కు గాయాల‌య్యాయి.

బ‌బ్లీ బౌన్స‌ర్ మీడియా స‌మావేశం ముగిసిన త‌ర్వాత మీడియా ప్ర‌తినిధుల‌తో త‌మ‌న్నా బౌన్స‌ర్లు వాగ్వాదానికి దిగారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధులు కూడా బౌన్స‌ర్ల‌ను నిల‌దీయ‌డంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదంతో పాటు ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఈ సంద‌ర్భంగానే త‌మ‌న్నా బౌన్స‌ర్లు మీడియా ప్ర‌తినిధుల‌పై దాడికి దిగారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!