పెళ్లి గురించి తమన్నా చెప్పేసింది..!

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఇటు తెలుగు, అటు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘అభినేత్రి 2’ తెలుగు, తమిళ భాషల్లో గత శుక్రవారమే విడుదలైంది. బోల్డ్‌గా కనిపించడంలోనూ ఏ మాత్రం వెనుకాడని ఈ భామకు ఇంకా పెళ్లి ఇప్పటికే 29 ఏళ్లు వచ్చేసిన ఇంకా పెళ్లి కాలేదు. ఈ భామ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అని అందరిలోనూ ఆసక్తి ఉంది. దీంతో ఆమె ఏదైనా కార్యక్రమంలో కనిపిస్తే చాలు.. తమ్ము నీ పెళ్లెప్పుడు? వరుడు దొరికాడా? అనే ప్రశ్నలే ఎదురవుతున్నాయి. అయితే ఇదే విషయాన్ని తాజాగా మీడియా సమావేశంలో తమన్నాను అడగ్గా .. నేను పెళ్ళికి సిద్ధంగా ఉన్నాను, మా చిత్ర దర్శకుడు ఏ.ఎల్ విజయ్ కు కూడా తనకొక సంబంధం చూడమని చెప్పాను, మీరు కూడా మంచి అబ్బాయి ఎవరైనా ఉంటే నాతో చెప్పండి అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది.

తమన్నా నటించిన దేవి 2 సినిమా త్వరలో విడుదల కాబోతుంది. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవా సరసన తమన్నా నటిస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రంలో తమన్నా ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాణంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 2 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.