తమన్నా వలనే సమస్యట!

బాలీవుడ్ లో రూపొందిన ‘క్వీన్’ సినిమా దక్షిణాది బాషల్లో రీమేక్ చేయడానికి నటుడు, నిర్మాత త్యాగరాజన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్స్ కోసం హీరోయిన్ గా తమన్నాను ఎన్నుకున్నారు. రెండు రోజులుగా ఈ సినిమా రీమేక్ చేయడం లేదని.. మొదలవ్వక ముందే సినిమాను ఆగిపోయిందని ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై త్యాగరాజన్ స్పందిస్తూ.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చేశారు.

ఈ సినిమా చేయడానికి తమన్నా ఆసక్తిగానే ఉంది.. కానీ ఆమె అడిగిన రెమ్యూనరేషన్ సమస్యగా మారింది అన్నారు. ఆమె అడిగినంత మేము ఇచ్చుకోలేక కాస్త ఆలోచనలో పడ్డాం. ఈ సినిమా తమన్నా చేసినా. చేయకపోయినా.. ప్రాజెక్ట్ ఆగే పరిస్థితి మాత్రం లేదని స్పష్టం చేశారు. మరి తమన్నా రెమ్యూనరేషన్ విషయంలో పట్టు బడితే మాత్రం మరొక ఆప్షన్ వెతుక్కోవాల్సి వస్తుంది.