తమన్నా తల్లిదండ్రులకు కరోనా


దేశంలో కరోనా విజృంవిభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువు సినీ నటులు కరోనా బారిన పడ్డారు. తాజాగా నటి తమన్నా తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తమన్నా స్వయంగా వెల్లడించింది. ఈ వీకెండ్ లో తన తల్లిదండ్రుల్లో స్వల్ప కరోనా లక్షణాలు కనిపించాయని… దీంతో ఇంట్లో ఉన్న అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది.

వెంటనే అందరం కోవిడ్ పరీక్షలు చేయించుకున్నామని… ఇప్పుడే రిపోర్టులు వచ్చాయని తెలిపింది. దురదృష్టవశాత్తు తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిందని చెప్పింది. తనతో పాటు ఇతర కుటుంబసభ్యులకు నెగెటివ్ వచ్చిందని తెలిపింది. మీ అందరి ప్రేమాభిమానాలతో వారు త్వరగా కోలుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

CLICK HERE!! For the aha Latest Updates