HomeTelugu Newsనందమూరి హీరోకి షాక్‌.. రెస్టారెంట్‌ను కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు

నందమూరి హీరోకి షాక్‌.. రెస్టారెంట్‌ను కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు

9 3నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నందమూరి హీరో తారకరత్నకు చెందిన ఫ్రెండ్స్‌ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న తారకరత్న రెస్టారెంట్ వద్దకు వచ్చి అధికారులతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్నారనే ఫిర్యాదులు రావడంతో కూల్చేందుకు వచ్చినట్లు అధికారులు తారకరత్నకు వివరణ ఇచ్చారు. అదే సమయంలో అధికారులతో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. రాత్రి వేళల్లో మద్యం, సౌండ్స్‌లో ఇబ్బందులు సృష్టిస్తున్నారని సొసైటీ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతోనే రెస్టారెంట్‌ను కూల్చివేసేందుకు వచ్చామని అధికారులు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu