HomeTelugu Newsఎన్నికల ఫలితాల తర్వాత ముక్కలవ్వనున్న టీడీపీ..!

ఎన్నికల ఫలితాల తర్వాత ముక్కలవ్వనున్న టీడీపీ..!

6 16

అధికారంలో ఉంటేనే ఏ పార్టీ అయినా ఐక్యంగా ఉంటుంది. అధికారం పోతే ఎవ్వరూ దగ్గరకు రారు.. ఈ విషయం ఎన్నో సార్లు నిరూపితమైంది. గడిచిన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎంతో మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలోకి లాగేశారు. 2019లో వారికి టికెట్లు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలపై గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు ఏపీలో ఓడిపోతే ఆయన వెంట ఉండాలంటే కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఇవాళ భ్రష్టు పట్టించిన చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు. టీడీపీని నాశనం చేసినందుకు చంద్రబాబు పై తిరుగుబాటు ఖాయమని .. ఈనెల 23 తర్వాత టీడీపీ ముక్కలవుతుందని అన్నారు.

అందుకే చంద్రబాబు ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించి పరువు కాపాడుకోవడం కోసం మహానాడును రద్దు చేసుకున్నాడని.. దీన్ని బట్టి టీడీపీ ఓటమి ఖాయమని ముందే తేటతెల్లమైందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మే 23 తర్వాత టీడీపీ పార్టీ కనుమరుగు సహా ఎన్నో వింతలు విడ్డూరాలు చోటుచేసుకోబోతున్నాయని దీన్ని అందరూ చూస్తారని విజయసాయిరెడ్డి ట్వీట్లతో చంద్రబాబును ఎండగట్టారు..

ఏపీలో వైసీపీ గాలి వీచిందని సర్వేలు చెబుతుండడం.. టీడీపీలో భయం చూశాక ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు తట్టాబుట్టా సర్దుకుంటున్నారని.. వైసీపీ గెలిస్తే ఆ పార్టీలోకి జంప్ చేయడానికి రెడీ అవుతున్నారని.. చంద్రబాబు చూపిన బాటలోనే వైసీపీ గెలిచాక ఈ పార్టీలోకి భారీగా వలసలు పెరగడం ఖాయంగా కనిపిస్తోందని.. దాన్నే విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!