Homeతెలుగు వెర్షన్అధికారం వైపు టీడీపీ.. వైసీపీ మీడియా నిర్ధారణ !

అధికారం వైపు టీడీపీ.. వైసీపీ మీడియా నిర్ధారణ !

TDP YCP media confirmation on the side of power

వైసీపీకి క‌లిసొచ్చే కాలానికి లోకేశ్ న‌డిచొచ్చాడు అట. వైసీపీ మీడియా ఇలాంటి కథనాలు ఎక్కువగా రాసుకుని ప్రస్తుతం సంతోష పడుతుంది. కానీ, ఇప్పుడు ఆంధ్రాలో టీడీపీకి ఊపు పెరిగింది. కాకపోతే, దాన్ని నీలి మీడియా అంగీకరించే పరిస్థితిలో లేదు. అందుకే.. ప్రధానంగా నారా లోకేశ్ ను టార్గెట్ చేస్తోంది నీలి మీడియా. ఇందులో భాగంగా ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యలు రాసింది. ఆంధ్రాలో టీడీపీ పార్టీకి చంద్ర‌బాబునాయుడు తీసుకొచ్చిన జోష్ కాస్త లోకేశ్ పాద‌యాత్ర‌తో హుష్‌మ‌ని పోగొట్టాడట. సరే, పోగొట్టాడా ? లేదా ? అనేది పక్కన పెడదాం. ఈ వ్యాఖ్యంలో వైసీపీ మీడియా చెప్పింది ఏమిటి ?, ఆంధ్రాలో టీడీపీ పార్టీకి చంద్ర‌బాబునాయుడు జోష్ తీసుకొచ్చాడు. ఇదే కదా.

నిజానికి మొన్నటివరకూ చంద్ర‌బాబునాయుడు సభలకు జనం రావడం లేదు అని ఇదే నీలి మీడియా విమర్శలు చేసింది. ఇప్పుడు ఏమో చంద్ర‌బాబునాయుడు టీడీపీ కి మళ్లీ జోష్ తీసుకొచ్చాడు అంటుంది. ఎట్టకేలకు వైసీపీ మీడియా పెన్ను స్లిప్ అయ్యి.. మొత్తానికి టీడీపీకి బాబు జోష్ తెచ్చాడు అని అంగీకరించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీడీపీకి నిద్ర‌లేని రాత్రుల్ని మిగిల్చిన కూలీ మీడియా ఇప్పుడు పసుపు దళానికి ఆనందాలను పంచింది. మ‌హానాడు, బాదుడే బాదుడే, ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి కార్య‌క్ర‌మాలు చంద్ర‌బాబు నేతృత్వంలో సాగాయి. వీటికి జ‌నం వెల్లువెత్తారు.

ఆ జనాన్ని చూసి జగన్ రెడ్డిలో భయం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పోటీ కాదు. అంతకు మించి. ఈ సారి టీడీపీ గెలిస్తే.. వ్యక్తిగతంగా కొందరు నాయకులను అంతం చేసే వరకూ వెళ్తాం అంటూ కొందరు టీడీపీ అభిమానులు శపధాలు చేస్తున్నారు. కోడెల శివప్రసాద్ రావు లాంటి దిగ్గజ నేతలను టీడీపీ కోల్పోయింది. దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే అనేది వారి అభిప్రాయం. దీనికితోడు.. జగన్ రెడ్డి సపోర్ట్ తో కొడాలి నాని, వంశీ, పేర్ని నాని లాంటి వారు తమ పరిధి దాటి మరీ విమర్శలు చేశారు. ఇప్పుడు వారందరికీ క్లిష్టమైన పరిస్థితే.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు ఎన్నికలు కాదు, ఓ యుద్ధమే. దీనికితోడు ఆంధ్రాలో ప్రస్తుత పరిస్థితులను బట్టి అధికారంపై టీడీపీలో ఆశ‌లు చిగురిస్తున్నాయి. త‌న స‌భ‌ల‌కు రెట్టించిన ఉత్సాహంతో వచ్చిన ప్ర‌జానీకాన్ని చూసి చంద్ర‌బాబులో నూత‌నోత్సాహం క‌నిపించింది. అప్పటి నుంచి చంద్రబాబు తన వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అన్నిటికీ మించి కోటంరెడ్డి లాంటి వైసీపీ నాయకులకు కూడా ఇప్పుడు టీడీపీలోనే భ‌విష్య‌త్తు కనిపిస్తోంది.

అందుకే, వారంతా జగన్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీలో ఆందోళ‌న రేకెత్తిస్తోంది. చంద్ర‌బాబు లాంటి నాయకుడిని తక్కువ అంచనా వేయడానికి లేదు. పైగా పార్టీ అంతా ఇక అయిపోయింది అనుకునే లోపే.. లేదు మొత్తం ఇప్పుడే మొదలైంది అనేలా బాబు టీడీపీని మళ్లీ నిలబెట్టారు. అందుకే, వైసీపీ మీడియా కూడా డైరెక్ట్ గా చంద్రబాబు టీడీపీకి జోష్ తెచ్చాడు అని అంగీకరించింది. సో.. రోజురోజుకు వచ్చే ఎన్నికల్లో అధికారం వైపు టీడీపీ అడుగులు పడుతున్నట్టే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu