HomeTelugu Trendingకేసీఆర్ బయోపిక్ తెలంగాణ దేవుడు ట్రైలర్

కేసీఆర్ బయోపిక్ తెలంగాణ దేవుడు ట్రైలర్

Telangana Devudu

తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా తెలంగాణ దేవుడు. వడత్యా హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు. జిషాన్ ఉస్మాన్, సంగీత హీరో హీరోయిన్లుగా నటించారు. మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యనే విడుదలైంది. కేసీఆర్ పాత్రలో నటించాలని చెప్పగానే షాక్ అయ్యానని, అసలు ఆ పాత్రకి నేను సరిపోతానా అని చాలా
ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. తెలంగాణను సాధించిన నాయకుడి పాత్రలో నటించినందుకు గర్వపడుతున్నానని అన్నారు. ఈ చిత్రంలో 50కి పైగా స్టార్ నటీనటులు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu