HomeTelugu Trendingరెండు సినిమాలు లైన్‌లో పెట్టాడు రోషన్‌!

రెండు సినిమాలు లైన్‌లో పెట్టాడు రోషన్‌!

Roshan will stars two new m
హీరో శ్రీకాంత్‌ కొడుకు నిర్మల కాన్వెంట్‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్‌. ఈ సినిమా అనంతరం కొంత గ్యాప్‌ తీసుకొని పెళ్లి సందడి సినిమాతో మరోసారి అలరించాడు ఈ యంగ్‌ హీరో. అయితే ఈ సినిమా అనుకున్నంతగా ఆశించకపోయినా రోషన్‌ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. దీంతో వరుస ఆఫర్లు వరిస్తున్నాయి. తాజాగా వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు రోషన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే దీనికి సంబంధించి సన్నాహకాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు సితార బ్యానర్‌లోనూ ఓ చిత్రానికి రోషన్‌ సైన్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తుంది. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu