HomeTelugu Big Storiesఆర్టీసీ సమ్మె ఉధృతం.. స్కూళ్లకు సెలవులు పొడిగింపు

ఆర్టీసీ సమ్మె ఉధృతం.. స్కూళ్లకు సెలవులు పొడిగింపు

7 11
ఆర్టీసీ సమ్మె కారణంగా తెలంగాణలో స్కూళ్లకు సెలవులను పొడిగించింది ప్రభుత్వం. ముందుగా ప్రకటించిన ప్రకారం సోమవారం నుంచి స్కూల్స్ తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ యూనియన్లు సమ్మె చేపట్టిన నేపథ్యంలో స్కూల్ విద్యార్ధులు పాఠశాలలకు వెళ్ళడం కష్టంగా మారే పరిస్థితులు ఉన్నందున ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 19 వరకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్ తెరిచే నాటికి బస్సుల సంఖ్య కూడా పెంచాలని అధికారులను ఆదేశించింది.

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై అఖిలపక్షం తదుపరి కార్యాచరణ ప్రకటించింది. ఇప్పటికే పలు రాజకీయ పక్షాలు సమ్మెకు బహిరంగ మద్దతు ప్రకటించి.. కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో సైతం పాల్గొన్ని వారికి సంఘీభావంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆదివారం నుంచి చేపట్టాల్సిన విధివిధానాలపై చర్చించారు. ఇక సమ్మెను ఉధృతం చేయలని అన్ని పక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా 13 వతేదీ వంటావార్పు, 14న బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న విద్యార్ధులతో కలిసి ర్యాలీలు, 17న ధూంధాం కార్యక్రమాలు,, 18న బైక్ ర్యాలీలు, 19న తెలంగాణ బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే బంద్‌పై పూర్తి క్లారిటీ మాత్రం రాలేదు. తమ డిమాండ్ల సాధనకోసం ఎంతటి పోరాటమైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీఎస్ఆర్టీసీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే తమకు మద్దతు నిచ్చిన వారికి ధన్యవాదలు చెబుతూనే.. మరికొన్ని కార్మిక సంఘాలు కూడా తమ పరిస్థితిని అర్ధం చేసుకుని మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!