HomeTelugu Trendingబింబిసార: 'ఓ తేనె పలుకుల' వీడియో సాంగ్‌ విడుదల

బింబిసార: ‘ఓ తేనె పలుకుల’ వీడియో సాంగ్‌ విడుదల

O Tene Palukula Video Song
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘బింబిసార’. మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని కథ ఆధారంగా ఈ టైం ట్రావెల్ సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ – టీజర్ – ట్రైలర్ మంచి స్పందన వచ్చింది. ఇటీవలే ‘ఈశ్వరుడే’ అనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా ‘ఓ తేనె పలుకుల’ అనే వీడియో సాంగ్ ని విడుదల చేశారు.

‘ఓ తేనె పలుకుల అమ్మాయి.. నీ తీగ నడుములో సన్నాయి.. లాగిందే..’ అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ప్రత్యేకమైన సెట్ లో కళ్యాణ్ రామ్ మరియు హీరోయిన్ కేథరిన్ థ్రెసా లపై చిత్రీకరించిన ఈ పాట విజువల్ గా కలర్ ఫుల్ గా ఉంది. ఈ పాటకు యాదగిరి స్వరాలు ట్యూన్ కంపోజ్ చేయడమే కాదు.. సాహిత్యం అందించారు. హైమత్ మహ్మద్ మరియు సత్య యామిని కలిసి ఈ జానపద శైలి మెలోడీ గీతాన్ని ఆలపించారు. ఈ సినిమాతో వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సంయుక్త మీనన్ – వారీనా హుస్సేన్ వంటి మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో ఉన్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu