‘రోబో 2’ లో మరో స్టార్ హీరో..?

గతంలో రజినీకాంత్, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ  సినిమాకు సీక్వెల్ గా ‘రోబో2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. రజినీకాంత్, అక్షయ్ కుమార్ వంటి  అగ్ర హీరోలు నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కూడా ఇటీవలే జరిగింది. అయితే శంకర్ ఇప్పుడు ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ కోసం తెలుగు  స్టార్ హీరోను తీసుకోవాలని భావిస్తున్నాడట. దీనికి ఓ కారణముందని చెబుతున్నారు. ఈ సినిమా మారెక్ట్ హై రేంజ్ లో జరగాలనేది శంకర్ ప్లాన్.  అలా జరగడానికి ఈ సినిమాకు అదనపు హంగులు ఉండాల్సిందే.

రజినీకాంత్ సినిమాకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే తెలుగులో ఓ స్టార్ హీరోను తీసుకొని రోబో2 లో గెస్ట్ రోల్ లో నటింపజేస్తే   సినిమాకు ప్లస్ అవుతుందని ఆలోచించిన శంకర్ ఎవరిని తీసుకోవాలా…? అని ఆలోచిస్తున్నాడు. ఈ పాత్ర దాదాపు రెండు నిమిషాలు ఉండేలా      జాగ్రత్త తీసుకుంటున్నాడట. ఇటువంటి సినిమాలో కనిపించడానికి ఏ హీరో అయినా ఆసక్తి చూపుతాడు. మరి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో..
చూడాలి!