HomeTelugu Newsఅల్లరి నరేష్‌ 'నాంది' న్యూ పోస్టర్‌ వైరల్‌

అల్లరి నరేష్‌ ‘నాంది’ న్యూ పోస్టర్‌ వైరల్‌

12 15

అల్లరి న‌రేష్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘నాంది’. నరేష్‌ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రం. ఇది అల్లరి న‌రేష్ 57వ చిత్రం. కాగా ఇప్పటికే విడుదలైన ‘నాంది’ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పోస్టర్‌లో అల్లరి నరేష్ ఒంటి మీద దుస్తులు లేకుండా గాయాలతో తల కిందులుగా వేళాడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా జూన్ 30న ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ చేయబోతున్నట్లు అల్లరి నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ”జూన్ 30 మంగళవారం – మీరందరూ ‘నాంది’ యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ చేయడానికి సాక్ష్యంగా నిలవండి” అంటూ ట్వీట్ చేశారు. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ చిత్రంతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ‘ఎ న్యూ బిగినింగ్’ అనేది ఈ సినిమాకు ఉప‌శీర్షిక‌. సామాజిక అంశాల మేళ‌వింపుతో, క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రమిది. వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, హ‌రీష్ ఉత్తమ‌న్‌, ప్రియ‌ద‌ర్శి, ప్రవీణ్ కీల‌క పాత్రలు పోషించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!