HomeTelugu Trendingఓటీటీలో అనసూయ 'థ్యాంక్‌ యు బ్రదర్‌'

ఓటీటీలో అనసూయ ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’

Thank you brother release
కరోనా సెకండ్‌ వేవ్‌ మరింత విజృంభిస్తుండటంతో మరోసారి సినిమా థియేటర్లు మూసేయక తప్పలేదు. దీంతో ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా బాట పడుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు వాయిదా పడ్డగా.. యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘థ్యాంక్‌ యు బ్రదర్’‌ కూడా థియేట్రికల్‌ రిలీజ్‌ను రద్దు చేసుకుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 30న థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మే 7న ఆహాలో రిలీజ్‌ చేస్తున్నారు. అశ్విన్‌ విరాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాతో రమేశ్‌ రాపర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో అనసూయ గర్భిణిగా నటిస్తోంది. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu