Homeపొలిటికల్అనగనగా మూడు రాజధానులు.. పెట్టుబడుల్లేవ్, ఉద్యోగాల్లేవ్

అనగనగా మూడు రాజధానులు.. పెట్టుబడుల్లేవ్, ఉద్యోగాల్లేవ్

That is the three capitals.. investments and jobs

ఏపీకి రాజధాని ఏది ?, నిజానికి ఈ పాయింట్ పై వచ్చినన్ని మీమ్స్ మరో పొలిటికల్ పాయింట్ మీద వచ్చి ఉండవు. అయినా, జగన్ రెడ్డి ఇంకా మూడు రాజధానుల విషయం మీదే ఉన్నాడు. నిజానికి మూడు రాజధానుల కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉంది. జగన్ రెడ్డి మాత్రం విశాఖే రాజధాని అని బాహాటంగానే ప్రకటిస్తున్నాడు. పైగా తాను కూడా త్వరలో అక్కడికే తరలి వెళ్తున్నానని జగన్ రెడ్డి ఢిల్లీలో ఒక కీలక సమావేశంలో కామెంట్ చేశాడు. ఇది జగన్ రెడ్డి పరిస్థితి. ఒక కేసు సుప్రీం కోర్టు కావొచ్చు, హైకోర్టు కావొచ్చు, విచారణలో ఉన్నప్పుడు దానికి సంబంధించి బహిరంగంగా ఎలాంటి కామెంట్స్ చేయకూడదనే చిన్న విషయం సీఎం స్థానంలో ఉన్న జగన్ రెడ్డికి తెలియకపోవడం ఏమనాలి ?

జగన్ కు ఈ చిన్న సంగతి కూడా తెలియకుండా ఉంటుందా ?, మరి తెలిసి కూడా ఎందుకు కామెంట్ చేశాడు ? పైగా గ్లోబర్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో త్వరలోనే విశాఖ ఏపీ రాజధాని కాబోతుందని సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం ?, అంటే తనకు కోర్టులతో సంబంధం లేదు అని జగన్ రెడ్డి ఫీల్ అవుతున్నాడా ?, లేకపోతే ఏపీ రాజధాని అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉండగా.. సీఎం హోదాలో ఉండి జగన్ రెడ్డి రాజధాని గురించి ఇలా మాట్లాడటం ఏ మాత్రం సరికాదు. అందుకే జగన్ సొంత పార్టీ ఎంపీ రఘురామరాజే జగన్ కి ఊహించని షాక్ ఇచ్చారు. ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రకటన చేసి సీఎం జగన్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని భారత చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు లేఖ రాశారు.

రాజధాని అంశం సుప్రీంకోర్టులో విచారణ వేళ జగన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. నిబంధనల ప్రకారం జగన్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని ఆ లేఖలోని సారాంశం. మరి ఎంపీ రఘురామ లేఖ వల్ల జగన్ రెడ్డికి ఏమైనా నష్టం కలుగుతుందా ?, నష్టం కలిగినా కలగకపోయినా కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. రాజధానిని మార్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు ఇప్పటికే తేల్చి చెప్పింది. ఐతే దీనిపై సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. ప్రస్తుత రాజధాని అమరావతి మాత్రమే. అమరావతిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు. సో.. సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. దీనికితోడు జగన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ కూడా కోర్టు తీర్పు బాగా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.

అయినా జగన్ ప్రభుత్వం అనుకోగానే రాజధాని మార్పు చేయడం అంత సులభమా ?, బహుశా జగన్ రెడ్డికి తెలియకపోవచ్చు. రాజధాని పేరుతో 29 వేల మంది నుంచి ప్రభుత్వమే భూములు సమీకరణ చేసింది. వారికి అనేక వాగ్దానాలు చేసింది. అవి నేరవేర్చకపోతే నష్టపరిహారం ఇస్తామని ఒప్పందం కూడా చేసుకుంది. ప్రభుత్వం రాజధానిని మార్చాలంటే.. ఈ సమస్యలను అధిగమించాలి. మరి జీతాలే సరిగ్గా ఇవ్వలేని జగన్ రెడ్డి రాజధాని రైతుల సమస్యలను ఎలా సాల్వ్ చేస్తాడు ?, దానికి వేల కోట్లు కావాలి. ఇప్పటికే పెట్టుబడిదారుల్లో ఉన్న మూడు రాజధానుల డైలమా ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోంది. ఇప్పుడు జగన్ రెడ్డి అనాలోచిత వ్యాఖ్యలు, నిర్ణయాలు కారణంగా ఆంధ్ర ఇంకా నష్టపోయే ఛాన్స్ ఉంది.

అసలు ఏపీకి కావాల్సింది మూడు రాజధానులు కాదు. అధికార వికేంద్రీకరణ. అవును, రాజధానిని ఒక్కటే పెట్టి.. అధికార వికేంద్రీకరణ చెయ్యొచ్చు. నిజానికి చంద్రబాబు ప్లాన్ చేసింది ఇదే. అధికార వికేంద్రీకరణ వల్ల అన్ని చోట్ల ఎంప్లామెంట్ లబిస్తుంది. నిరుద్యోగం తగ్గుతుంది. కానీ, జగన్ రెడ్డి మూడు రాజధానులు వల్ల.. ఏం జరిగింది ?. ఎంప్లామెంట్ లేకుండా పోయింది. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి, ఆంధ్ర ప్రజల్లారా ఇకనైనా జగన్ రెడ్డి మాయలో నుంచి బయటకు రండి. చివరకు ఏపీకి రాజధాని ఏది ?, జగన్ ఓటమే సమాధానం అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu