‘మహర్షి’ లో ఆ ట్విస్టే కీలకం..!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. ఈసినిమా ఆర్ఎఫ్సి షెడ్యూల్ నిన్నటితో కంప్లీట్ అయింది. కొత్త సంవత్సరంలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక సమాచారం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. మహర్షి సినిమాలో ఓ సీన్ అదిరిపోతుందట. ఆ సీన్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

మహేష్ యూఎస్ లో బిజినెస్ మెన్ గా కనిపిస్తాడు. యూఎస్ నుంచి ఇండియాకు వచ్చే సమయంలో కీలక ట్విస్ట్ తో కూడిన సన్నివేశం ఉంటుందని.. ఇది అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కు కూడా ఒళ్ళు జలదరించే విధంగా ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 5 న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సీన్ ఏంటి.. కీలకమైన ట్విస్ట్ ఏంటి అని తెలియాలంటే విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే.