మన్మోహన్‌ యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌పై నిషేధం?

అనుకున్నట్లే మన్మోహన్‌ సింగ్‌పై తీసిన యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ సినిమాను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవచ్చని కూడా తెలుస్తోంది. నిన్న సినిమా ట్రైలర్‌ విడుదలైన తరవాత కాంగ్రెస్‌ పార్టీ నేతల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గతంలో మన్మోహన్‌ సింగ్‌ వద్ద పనిచేసిన సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఇందులో బీజేపీ ఎంపీ అనుపమ్‌ ఖేర్‌… మన్మోహన్‌ సింగ్‌గా నటించారు. గాంధీ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ ఆయన ఈ యాక్సిడెంటల్‌ ప్రైమినిస్టర్‌ ఇప్పటికే విమర్శలు వచ్చాయి. 2014 ఎన్నికల సమయంలో ఈ పుస్తకం విడుదల అయింది. ఇపుడు మళ్ళీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేవలం తప్పుడు సమాచారంతో గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే ఈ సినిమా తీశారని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.