HomeTelugu Newsపాన్ ఇండియా ప్రాబ్లమ్‌తో కామెడీ హీరో.. మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్లేనా!

పాన్ ఇండియా ప్రాబ్లమ్‌తో కామెడీ హీరో.. మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్లేనా!

The comedy hero back on hi

టాలీవుడ్‌లో ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ తన కామెడీ టైమింగ్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమా ‘అల్లరి’నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. ఆతరువాత పలు సినిమాలతో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టకున్నాడు.

ఆతరువాత తన రూట్‌ కొంచెం మార్చాడు అల్లరోడు. పూర్తిగా యక్షన్‌ మోడ్‌లోకి వెళ్లి.. నాంది, ఉగ్రంలాంటి సీరియస్ మూవీస్‌ చేశాడు. ఈ సినిమాల్లో అల్లరి నరేష్‌ నటన ఎంత బాగున్నాకానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

ఇటీవలే నాగార్జున హీరోగా నటించిన నాసామిరంగ మూవీలో సపోర్టింగ్‌ రోల్‌ చేశాడు. తాజాగా నరేష్‌ మళ్లీ తన ట్రాక్‌లోకి వచ్చేసిన్నట్లే అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మరోసారి అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ తో రాబోతున్నాడు.

1992లో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఈవీవీ సత్యనారాయణ తీసిన సినిమా ఆ ఒక్కటీ అడక్కు అప్పట్లో సూపర్ డూపర్ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టైటిల్ తో నరేష్ మరో సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ గ్లింప్స్ ఈరోజు (ఫిబ్రవరి 16) విడుదలయ్యాయి.

ఫన్నీగా సాగిన ఈ గ్లింప్స్ వీడియో ఈ మూవీ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పింది. పెళ్లి వయసు దాటిపోతున్న యువతకు ఆ పెళ్లే పాన్ ఇండియా ప్రాబ్లెమ్ అని ఈ చిన్న వీడియో ద్వారా మేకర్స్ చెప్పకనే చెప్పారు. ఈ సినిమా నరేష్‌కు పర్ఫెక్ట్‌ కమ్‌ బ్యాక్ మూవీలా అనిపిస్తుంది.

మల్లీ అంకం డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. అల్లరి నరేష్ నటిస్తున్న ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!