HomeTelugu Trendingమళ్లీ మూతపడనున్న థియేటర్లు!

మళ్లీ మూతపడనున్న థియేటర్లు!

Theaters closed from next m

9 నెల‌ల లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవలే తెరుచుకున్న థియేటర్లు తెలంగాణలో మార్చి 1నుండి మూసివేస్తామంటూ ఎగ్జిబిట‌ర్స్ అంటున్నారు. సినీ నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు నెలకొన్న వివాదమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. మల్టీప్లెక్సులకు ఉండే హక్కులనే సింగిల్ స్క్రీన్‌లకు కూడా వర్తింపజేయాలని థియేటర్‌ యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. మల్టీపెక్సుల మాదిరే పర్సంటేజ్‌ సిస్టమ్‌ను అమలుచేయాలని అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా పెద్ద సినిమా అయితే విడుదలైన 6వారాల తర్వాత, అదే చిన్న సినిమా అయితే 4వారాల గ్యాప్‌ తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయాలని తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మార్చి 1నుంచి థియేటర్లు మూసివేస్తామని హెచ్చరించారు.

లాక్‌డౌన్‌ అనంతరం థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో వరుసగా సినిమాల రిలీజ్‌ డేట్స్‌ని ప్రకటించిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాలు సైతం భారీగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది సమ్మర్‌లోనూ చాలా సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల డిమాండ్లకు నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి

Recent Articles English

Gallery

Recent Articles Telugu