నాకు పోటీ అనేదే లేదు: చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు బాలయ్య ‘శాతకర్ణి’ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి రావడం కాకతాళీయమని చిరంజీవి అన్నారు. తనకు బాలయ్య మంచి
స్నేహితుడని ఆయన సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. తమ మధ్య పోటీ ఉందని చెప్పడం కేవలం క్రియేషన్ మాత్రమే అని కొట్టిపారేశారు. అంతేకాదు చిరు మరిన్ని విషయాలను షేర్ చేసుకున్నారు.
తొమ్మిదేళ్ళ తరువాత రాబోతున్న ఈ సినిమా ప్రివ్యూ షో తన తల్లి అంజనాదేవి చూడనంటున్నారట.. నేరుగా థియేటర్ లో చూస్తేనే కిక్ అని అన్నారని చిరంజీవి నవ్వుతూ చెప్పారు. అలానే తన భర్త చిరంజీవి, కొడుకు రామ్ చరణ్ లలో ఎవరి నటన అంటే ఎక్కువ ఇష్టమనే చెప్పలేనని..
ఇద్దరు షూటింగ్ లో బిజీ కావడం చూస్తుంటే మాత్రం ముచ్చటగా ఉంటుందని చిరంజీవి సతీమణి సురేఖ అన్నారు.