Homeపొలిటికల్ఇది మన బటన్ రెడ్డి అభివృద్ధి.. బీహార్ ఏం సరిపోద్ది ?

ఇది మన బటన్ రెడ్డి అభివృద్ధి.. బీహార్ ఏం సరిపోద్ది ?

jagan

ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య తరుచూ ఓ ప్రశ్న జనం నోళ్లలో వైరల్ అవుతూ ఉంది. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక, ఆంధ్ర రాష్ట్రం అసలు అభివృద్ధి చెందిందా ?, లేక ఇంకా నాశనం అయ్యిందా ?. చదువుకున్న వారికీ ఈ ప్రశ్నకు జవాబు చెప్పక్కర్లేదు. మరీ చదువులేని వారికీ చెప్పేదెవరు ?, ప్రతిపక్షాలు చెబుతున్నా.. కులాలు, మతాల వారీగా విడిపోయిన ప్రజలు మాటేమిటి ?. సరే మన బటన్ రెడ్డి గోరి పనితనం గురించి ముచ్చట పెట్టుకుందాం. ఇరవై ఐదేళ్ల క్రితం బీహార్ ఎలా ఉందో.. ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రం అలా ఉంది.

అప్పట్లో బీహార్ లో అభివృద్ధి ఎలా ఉందో.. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అలా ఉంది. అప్పట్లో బీహార్ లో కరెంటు ఎప్పుడో ఓ సారి వస్తుంది. ఇప్పుడు బటన్ రెడ్డి గోరి పాలనలో కూడా అంతే. సరే మిగిలిన చోట్ల అయినా మన మూడు ముక్కల ముఖ్యమంత్రి ఏమైనా చేశాడా అంటే.. ఏమీ లేదు. ‘విద్యాదీవెన’ పెట్టారు. మొదట్లో చిన్నా చితకా కాన్వెంట్లు ఖాళీ అయిపోయాయి. కొత్త విద్యా విధానం ప్రవేశ పెట్టారు. ఇప్పుడు సర్కారీ పాఠశాలలు మూతపడే స్థితి ఏర్పడింది. ఉన్న పోస్టులే మాయం అయ్యే స్థితి. ఎందుకంటే నాలుగో తరగతిని దూరాన ఉన్న ఉన్నత పాఠశాలల్లో కలిపేశారు. అంత దూరం వెళ్లలేని బుడతలు మానేయడమో, అప్పో సప్పో చేసి కాన్వెంట్ లో చేరడమో చేశారు.

ఇంకేం ఉంది ?, ఇక ఎంచక్కా మూతపడే పాఠశాలల్లో తన ప్రభుత్వ కార్యాలయాలు పెట్టుకోవచ్చు. ఆల్ రెడీ కొన్ని ఏరియాల్లో మన బటన్ రెడ్డి ఈ కార్యక్రమాలను విజయ వంతంగా పూర్తి చేశాడు. మరి ఇదేం అభివృద్ధి బటనన్నా ? అని ఎవరైనా అడిగితే.. వారి పై కేసులు, ఇంకా అవసరం అయితే అరెస్ట్ చేసి లాఠీలు ఇరిగేలా కొట్టడం ?, ఒక ఎంపీనే ఇలా కొడితే.. ఇంతవరకు న్యాయం జరగలేదు ?. ఇదండీ మన బటన్ రెడ్డి అభివృద్ధి ఇలా ఉంటుంది. ఇక రోడ్లు పరిస్థితి వర్ణనాతీతం. కనీసం గతుకులు పూడ్చలేని స్థితి. వంతెనలు లేక, మారుమూల ప్రాంతాల్లో ఈదుకుంటూ బడికి వెళ్లే పిల్లల అవస్థలు చెప్పలేం.

దేశంలో ఎక్కడా లేని విధంగా చెత్త పన్ను వసూలు చేసి, పారిశుద్ధ్యం వదిలించుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కూడా మన బటన్ మోహన్ రెడ్డే. ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయం గురించి చెప్పుకోవాలి అండోయ్. ‘చెత్తపన్ను కట్టకపోతే వాళ్ల ఇంటిముందు, షాపు ముందు కుప్పలుగా చెత్తను పోయండి’ అని మన మూడు ముక్కల ముఖ్యమంత్రి ఆదేశించారు కూడా. ఇక ‘చూసి రమ్మంటే కాల్చి వచ్చే ‘ అధికారగణం గురించి చెప్పేదేముంది! అంతా పని చేసి వచ్చారు కూడా. ఇదండీ మన బటన్ రెడ్డి అభివృద్ధి ఇలా సాగుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే.. మన బటనన్న పాలనలో ఏ శాఖ అభివృద్ధి చూసినా ఆమడ దూరంలో ఉంది. ఎన్నో ధరలు ఆకాశాన్ని అంటాయి. అడిగితే “మొర్రో” కుర్రో అనాలి. అలా ఉంటుంది ట్రీట్మెంట్. నేరుగా పోలీస్ లు ఇంటికి వస్తారు. వివరణలు ఉండవు. పట్టుకెళ్లి పోవడమే. సలామ్ అన్నా.. బటనన్న మనసు కరగదు. ఎన్నని చెబుతాం. ఇక పొలవరం ప్ర’గతి’ అంతంత మాత్రమే. ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో బటన్ రెడ్డి మాత్రం ఓ చరిత్ర సృష్టించారు. ఓ పక్క ఉద్యోగుల, పెన్షనర్ల జీతాలకు సొమ్ము లేదంటూనే కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మంత్రితో సమానమైన సలహాదారులను అసంఖ్యాకంగా నియమించుకున్నాడు. ఎందరూ అంటే ఎందరో చెప్పలేనంత. ఈ ఖర్చులు భరించడానికి సొమ్ములెక్కడివి? ఎవరివి ? ఇదండీ మన బటన్ రెడ్డి అభివృద్ధి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!