
ఆంధ్రాలో రోడ్ల పరిస్థితి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు రోజూ ప్రయాణించే ప్రకాశం బ్యారేజ్ మీద రోడ్డు కూడా గుంతలతో నిండిపోయింది. ఇక మారుమూల ఊళ్లలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేయించండి సారూ అని ప్రజలు మొర పెట్టుకుంటున్నా… జగన్ రెడ్డి పట్టించుకునే స్థితిలో లేడు. నిజానికి రవాణా వ్యవస్థ అన్నింటి కంటే మూలం. అలాంటి ముఖ్యమైన విషయంలోనే జగన్ రెడ్డి అడ్డంగా చేతులు ఎత్తేస్తే.. ఇక మిగిలిన వాటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాలా ?, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పక్షానికి మద్దతు ఇవ్వాలి ?, అసలు బుద్ధి వున్న వాడు ఎవరైనా ఓటు వెయ్యాల్సిందే పార్టీ నాయకులను చూసి కాదు, నియోజకవర్గం లో నిలుచున్న వ్యక్తి ని చూసి.
ఉదాహరణకి ఫలానా సుబ్బారావుకి వై యస్ జగన్ మోహన్ రెడ్డి అంటే అభిమానం అనుకోండి. కానీ నియోజకవర్గంలో పోటీ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ కాండిడేట్ కంటే టీడీపీ లేదా జనసేన లోని కాండిడేట్ మంచి నాయకులు మరియు అవినీతి చెయ్యరు అని సుబ్బారావు భావిస్తే.. కచ్చితంగా సుబ్బారావు వారికే ఓటు వేయాలి, వైసీపీ కి కాదు. నిజమే కొన్నిసార్లు మంచి కాండిడేట్ అని అనుకున్న వ్యక్తి ఖచ్చితంగా గెలవరు అని అంచనా వుండచ్చు. అయినా సరే మనసు మార్చుకుని అవినీతి పరుడికి మాత్రం ఓటు వేయకూడదు. వేస్తే ముఖ్య నాయకుడు మంచోడు అయినా లోకల్ అవినీతి నాయకుడు కారణంగా ప్రజలకు మేలు జరగడం లేదు.
అసలు ఒక్క నాయకుడు బాగుంటే ఆంధ్ర రాష్ట్రం మారదు. లోకల్ గవర్నెన్స్ కూడా బాగుండాలి. లోకల్ నాయకులు కూడా సరైన వారై ఉండాలి. ఎప్పుడైతే పార్టీ నో , పార్టీ పెద్దనో చూసి కాకుండా లోకల్ కాండిడేట్ ని చూసి ఓటు వేస్తారో అప్పుడే లోకల్ గవర్నెన్స్ లో మార్పు వస్తుంది, అవినీతి మరియు నేర చరిత్ర కలిగిన నాయకులకి టిక్కెట్లు ఇవ్వడం తగ్గుతుంది. తద్వారా రాష్ట్రమే బాగుపడుతుంది. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఈ మార్పు వస్తోందని రావాలని ఆశిద్దాం.













