HomeTelugu Trendingటైగర్‌ నాగేశ్వర్‌ రావు: ఫస్ట్‌ సింగిల్‌ అప్డేట్‌

టైగర్‌ నాగేశ్వర్‌ రావు: ఫస్ట్‌ సింగిల్‌ అప్డేట్‌

Tiger Nageswara Rao First S

టాలీవుడ్‌ యాక్టర్‌ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వర రావు’. స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్‌ రావు జీవిత కథగా పాన్ ఇండియా బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్ ఏక్‌ దమ్‌ ఏక్‌ దమ్ సాంగ్ లుక్ విడుదల చేశారు. ఈ సాంగ్‌ను సెప్టెంబర్ 5న లాంఛ్ చేయనున్నారు.

హీరోహీరోయిన్లపై వచ్చే ఈ సాంగ్‌ రవితేజ అభిమానులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతున్నట్టు ఫస్ట్‌ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశాడు. ఈ చిత్రంలో నుపుర్ సనన్‌ టైగర్‌ నాగేశ్వ ర రావు ప్రియురాలు సారా పాత్రలో నటిస్తోంది. ట్రైన్‌లో నుంచి తన ప్రియుడి కోసం చూస్తున్నట్టుగా ఉన్న లుక్ ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు గ్లింప్స్‌లో గూస్‌ బంప్స్ తెప్పించే రవితేజ విజువల్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్‌ మరో ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. సీనియర్‌ నటి రేణూదేశాయ్‌.. హేమలత లవణం పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అక్టోబర్ 20న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!