HomeTelugu Trending'టైగర్‌ నాగేశ్వర రావు' టీజర్‌

‘టైగర్‌ నాగేశ్వర రావు’ టీజర్‌

tiger nageswara rao stunninమాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వర రావు’. వంశీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

హైదరాబాద్‌, బాంబే, ఢిల్లీ అనేక నగరాల్లో దారుణంగా దోపిడీలు చేసిన స్టూవర్ట్‌పురం దొంగ మద్రాస్ సెంట్రల్‌ జైలు నుంచి తప్పించుకున్నాడంటూ సాగే డైలాగ్స్‌తో షురూ అయింది టీజర్‌. సార్ నాగేశ్వరరావు పాలిటిక్స్‌లోకి వెళ్లుంటే వాడి తెలివితేటలతో ఎన్నికల్లో గెలిచేవాడు. స్పోర్ట్స్‌లోకి వెళ్లుంటే పరుగుతో ఇండియాకు మెడల్‌ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్లుంటే ధైర్యంతో యుద్దమే గెలిచేవాడంటూ రవితేజ క్యారెక్టరైజేషన్‌ గురించి మురళీశర్మ చెబుతున్న సంభాషణలు సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఈ టీజర్‌లో రవితేజ లుక్‌ ఆకట్టుకుంటుంది.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసిన టీజర్‌ అందరినీ ఇంప్రెస్‌ చేసేలా సాగుతోంది. ఇప్పటికే విడుదల చేసిన టైగర్‌ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్‌ సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. ఈ సినిమాతో నటి రేణదేశాయ్‌ రీఎంట్రీ ఇస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!